
బెంగళూరును ఎక్కువగా సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు. దేశం నలుమూలల నుండి ప్రజలు ఐటీ రంగంలో పనిచేయడానికి ఇక్కడికి వస్తారు. కొందరు ఇల్లు అద్దెకు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. కొందరు ఇంటి ఓనర్లు ఇష్టారాజ్యంగా విద్యుత్, నీటి బిల్లులు చూపి అద్దెదారులను పిండేస్తుంటారు... ఇవన్నీ ఇక్కడ అనేది అద్దెదారులకు సర్వసాధారణం. ఇప్పుడు అలాంటి ఒక కేసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరులో ఒక ఇంటి ఓనర్ ఇద్దరు వ్యక్తులకు నెలకు రూ.15 వేల 800 వాటర్ బిల్లు వసూలు చేస్తున్నాడు. దింతో రెంట్ ఉంటున్న ఆ ఇద్దరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అంతేకాకుండా ఏంటి అని అడిగితే ఇంటి ఓనర్ వాళ్ళని 1.65 లక్షల లీటర్ల నీళ్లు వాడినట్లు చెబుతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది.
నిజానికి ఓ నెటిజన్ రెడ్డిట్‌లో ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు. మేము 1,65,000 లీటర్ల నీళ్లు వాడుతున్నామని రూ.15,800 బిల్లు వచ్చిందని, ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉంటున్నామని చెప్పారు.
ఇలా మాకు ప్రతి నెలా దాదాపు రూ.10వేల వాటర్ బిల్లు వస్తుంది. మేము ఇద్దరం కూడా ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతాం. నేను దీని గురించి ఇంటి ఓనరుతో కూడా మాట్లాడాను, కానీ అతను ప్రతిసారీ ఎదో సాకులు చెబుతుంటాడు. ప్రతి 15 రోజులకు ఒకటి లేదా రెండు రోజులు వాటర్ సప్లయ్ ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎం చేయాలి? అంటూ ప్రశ్నించాడు.....
ఈ పోస్ట్ కాస్త వైరల్ అయిన తర్వాత, చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు. ఒకరేమో ఈ వాటర్ బిల్లు అస్సలు సాధ్యం కాదని, ఇంకొకరు మీటర్‌లో వాటరుకు బదులు గాలి పంపిస్తున్నాడా అని, ఇంకొకరైతే ఇద్దరు వ్యక్తులకు రూ. 300 కంటే ఎక్కువ బిల్లు అస్సలు రాదని అంటున్నారు.
Bangalore Water Supply and Sewerage Board (BWSSB) వెబ్‌సైట్ ప్రకారం, సగటున ఒక వ్యక్తి రోజుకు 135-150 లీటర్ల నీటిని ఉపయోగిస్తాడు, అంటే ఇద్దరికి ప్రతినెల వినియోగం 8వేల నుండి 9వేల లీటర్లు ఉండాలి.