
జగిత్యాల జిల్లాలో తోటి మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తహశీల్దార్ పై కేసు నమోదు చేశారు పోలీసులు . పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విధుల్లో ఉండగా.. ఓ మహిళా ఉద్యోగికి వాట్సాప్ లో అసభ్యకరంగా మెసేజ్ లు , కాల్స్ చేసి వేధిస్తున్నాడని తహశీల్దార్ రవీందర్. ఈ విషయంపై బాధిత మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న విషయం తెలుసుకుని జగిత్యాలకు చెందిన మరో తహశీల్దార్ తో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు రవీందర్. కాళ్ళు మొక్కిస్తా వదిలేయాలని ఎవరికి ఫిర్యాదు చేయకుండా రాజీ కుదుర్చుకోవాలని మహిళా ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చారు. అయినా వెనక్కి తగ్గకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సెప్టెంబర్ 12న తహశీల్దార్ రవీందర్ ను రిమాండ్ కు తరలించారు .
►ALSO READ | సద్గురు డీప్ ఫేక్ వీడియోతో.. భక్తురాలికి రూ. 3 కోట్ల 75 లక్షల టోకరా!
.