
పట్టపగలు.. బ్యాంకులో కస్టమర్లు, బ్యాంకు సిబ్బంది తమపనుల్లో బిజీగా ఉన్నారు.. సడెన్ గా బ్యాంకులోకి చొరబడిన యువకుడు. ఓ టేబుల్ కింద ఉన్న బ్యాగ్ గమనించాడు. అక్కడున్న కస్టమర్లు, బ్యాంకు సిబ్బంది కళ్లుగప్పి క్షణాల్లో బ్యాగును ఎత్తుకెళ్లాడు.. బ్యాగులో ఏం ఉందో తెలుసా..లక్షలు విలువ జేసే బంగారం, నగదు. వివరాల్లోకి..
మధ్యప్రదేశ్ లో ఓ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బేతుల్ జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో కస్టమర్ బ్యాగులోంచి 12కేజీల బంగారం, రూ.5లక్షల నగదు చోరీకి గురైంది. ఈ చోరీకి సంబంధించిన సీసీఫుటేజ్ శనివారం (సెప్టెంబర్ 13) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వీడియోలో నీలిరంగు టీ-షర్టు, నల్ల ప్యాంటు ధరించిన ఓ యువకుడు లక్ష్యం లేకుండా తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. అతను ఓ టేబుల్ కింద ఉంచిన కస్టమర్ ను చూస్తాడు. బ్యాగులో నగదు ఉందని తెలుసుకున్న ఆ దొంగ కేవలం 30 సెకన్లలో ఆ బ్యాగ్ తీసుకొని బ్యాంకునుంచి పారిపోయాడు. గమనించిన కస్టమర్ వెంటనే, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితునికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
►ALSO READ | సబ్బుల నుంచి హార్లిక్స్ వరకు రేట్లు తగ్గించిన హిందుస్థాన్ యూనీలివర్.. కొత్త రేట్లివే.
ఆగస్టు నెలలో కూడా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకులో దుండగుల బృందం భారీ దోపిడీకి పాల్పడ్డారు.14 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదును చోరీకి గురైంది. నిందితులు పట్టపగలు భవనంలోకి చొరబడి తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. తర్వాత నిందితులను పోలీసులకు చిక్కారు.