బీజేపీలో మొదలైన టికెట్ల హడావిడి.. ఒక్కో స్థానానికి 5 నుంచి 25 మంది పోటీ!

బీజేపీలో మొదలైన టికెట్ల హడావిడి.. ఒక్కో స్థానానికి 5 నుంచి 25 మంది పోటీ!

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. సెప్టెంబర్ 4 నుంచి 10 తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. గత ఎన్నికల సమయంలో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో సత్తా చాటింది. మునుగోడులోనూ రెండో స్థానానికి ఎగబాకింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి 48 డివిజన్లలో విజయం సాధించిన విజయం తెలిసిందే.. ఆ తర్వాత బీజేపీ కార్యదర్శి బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్రల ద్వారా బీజేపీకి నయా జోష్ వచ్చింది. ముఖ్యంగా యువకులు కాషాయ జెండా వైపు ఆకర్షిుతలయ్యారు. కర్ణాటక  ఎన్నికల ఫలితాల తర్వాత కొంత డీలా పడ్డట్టు కనిపించినా చాపకింద నీరులా సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీల బలోపేతం, ప్రముఖులను నియమించడం, ఎస్సీ,ఎస్టీ రిజర్వ్ డ్ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి వర్క్ షాపులు  నిర్వహించడం చేసింది. ప్రస్తుతం నిరుద్యోగ మిలియన్ మార్చ్ కు రెడీ అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే 9ఏండ్లలో మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తుంది.

దరఖాస్తుల స్క్రీనింగ్ కోసం కమటీ

సెప్టెంబర్ 4 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వారి నుంచి బీజేపీ దరఖాస్తులను స్వీకరించనుంది.  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిని స్క్రీనింగ్ చేసేందుకు త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. స్టేట్ స్క్రీనింగ్ కమిటీ వడపోత తర్వాత ముగ్గురి పేర్లను అదిష్టానానికి పంపుతారు. అక్కడే అభ్యర్థి ఎవరనేది ఫైనల్ అవుతుంది. 

ముషీరాబాద్,ఇబ్రహీంపట్నలంలో  తీవ్ర పోటీ

బీజేపీ టికెట్ కోసం ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 25 మంది పోటీపడతారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో  అంతకన్నా ఎక్కువ దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ముషీరాబాద్, ఇబ్రహీంపట్నం లాంటి సెగ్మెంట్లలో దరఖాస్తుల సంఖ్య 30 దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.  నర్సాపూర్ లో పోటీ చాలా తక్కువగా ఉండే చాన్స్ ఉంది. 

.