భక్తి శ్రద్ధలతో గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి : షబ్బీర్అలీ

 భక్తి శ్రద్ధలతో గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి :  షబ్బీర్అలీ
  • ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​అలీ

నిజామాబాద్​, వెలుగు: భక్తిశ్రద్ధలతో గణేశ్​ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సూచించారు. గురువారం గణపతి వేడుకలపై పోలీస్, మున్సిపల్​ కార్పొరేషన్, ట్రాన్స్​కో ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. మండపాల వద్ద విద్యుత్ సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శోభాయాత్ర జరిగే రూట్​లో కరెంట్ తీగలు తగలకుండా చూడాలన్నారు. రోడ్డు గుంతలు పూడ్చాలని సూచించారు. 

ఆలయం కమిటీ ప్రమాణ స్వీకరణ

నగరంలోని గోల్​హనుమాన్​ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి షబ్బీర్​అలీ హాజరయ్యారు. చైర్మన్​గా బండారి నరేందర్,​డైరెక్టర్లుగా తోడుపునూరి రామ్మోహన్, గుండ సుధీర్, కరిపె లింగం, క్యాసారం విజయ్ కుమార్, ఉప్పరి స్వప్న, గంట జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. ఆరెకటిక సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన హాజరయ్యారు. నుడా చైర్మన్​ కేశవేణు, స్టేట్ అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్​ గడుగు గంగాధర్​, రత్నాకర్ ఉన్నారు.