V6 News

కోల్‌కతాలో మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్‌ ! అబ్‌రామ్‌తో ఫొటో... వీడియో వైరల్..

కోల్‌కతాలో మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్‌ ! అబ్‌రామ్‌తో ఫొటో... వీడియో వైరల్..

ప్రపంచ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీని బాలీవుడ్ హీరో  షారుఖ్ ఖాన్ ఇవాళ(13 శనివారం) ఉదయం కలిశారు. ఈ అద్భుతమైన కలయిక భారతదేశంలోని కోల్‌కతా నగరం సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగింది.

ఈ మీటింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో షారుఖ్, మెస్సీల అభిమానులు  సంతోషంగా ఊగిపోయారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్  చిన్న కొడుకు అబ్‌రామ్‌ను కూడా వెంట తీసుకొచ్చారు. ఈ వీడియోలో మెస్సీ  అబ్‌రామ్‌తో కలిసి ఫొటో దిగడం చూడవచ్చు.

అభిమానుల ఆనందం :షారుఖ్ ఖాన్, మెస్సీ ఒకేచోట ఉండటం చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఒక నెటిజన్ "బాలీవుడ్ కింగ్, ఫుట్‌బాల్ కింగ్ కలిశారు! స్వచ్ఛమైన స్టార్ పవర్ ఒకే ఫొటోలో" అని ట్వీట్ చేయగా...  మరొకరు "ప్రపంచంలోనే అతిపెద్ద సినీ హీరో షారుఖ్ ఖాన్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా దిగ్గజం లియోనెల్ మెస్సీని కోల్‌కతాలో కలిశారు. ఇది చరిత్ర" అని కామెంట్ చేయగా....ఇంకొక నెటిజన్ అయితే "ఈ కలయిక అద్భుతం... షారుఖ్ ఖాన్ & మెస్సీ కలిసి ఒకేచోట " అంటూ ట్వీట్ చేశారు.