తమిళ రాజకీయాల్లో మరో సంచలనం ఈ వార్త. మెజారిటీలేని టీవీకే.. చిన్నా చితకా పార్టీల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. ఎప్పుడు కూలుతుందో గ్యారెంటీ లేదనే విపక్షాల విమర్శలకు మాస్టర్ స్ట్రోక్ ఇస్తూ అన్నా డీఎంకీ చీలిక వర్గం సంచలన ప్రకటన చేసింది. విజయ్ పీపుల్స్ సీఎం.. ఆయనకే మా మద్ధతు అంటూ సీవీ శణ్ముగం వర్గం ప్రకటించింది. ఇక సీఎం సీటును టచ్ చేసే వాళ్లుండరు అని టీవీకే వర్గాలు అనుకునేలా ప్రకటన చేశారు షణ్ముగం.
ఏఐడీఎంకే కు చెందిన సీవీ షణ్ముగం వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలున్నారు. సీఎం విజయ్ కి తమ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీని చీల్చుతున్నారు కదా అన్న ప్రశ్నకు.. తనకు పార్టీని చీల్చే ఆలోచన లేదని షణ్ముగం అన్నారు. తమ చిరకాల శత్రువైన డీఎంకేతో కలిసేందుకు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి మంతనాలు జరిపారు.. అందుకే మేము ఆయన నుంచి దూరంగా వెళ్తున్నాం. టీవీకే ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నాం.. అంటూ ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి షణ్ముగం వర్గం విజయ్ కి సానుకూల సంకేతాలు పంపుతూ వస్తోంది. అయితే డీఎంకేతో పొత్తుకు వెళ్లాలని చూస్తున్నారని.. ముందునుంచే పళనిస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఏఐడీఎంకే పార్టీ ఈ ఎన్నికల్లో 47 స్థానాలు గెలుచుకుంది. షణ్ముగం వర్గానికే పార్టీలో మెజారిటీ ఉంది.
ఒక రోజులో సీఎం విజయ్ ప్రభుత్వ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన సమయంలో.. షణ్ముగం వర్గం మద్ధతు ఇవ్వడంతో ఇక అంతా ప్రశాంతం అంటున్నారు విశ్లేషకులు . ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం 108 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు పది మంది తక్కువగా ఉండటంతో కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక అన్నాడీఎంకే వర్గం కూడా కలిస్తే ప్రభుత్వానికి ఇప్పట్లో ఎలాంటి ఢోకా ఉండనట్లే.
