
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్( Shanmukh Jaswanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ స్టూడెంట్(Student). తాజాగా ఈ సిరీస్ నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇన్ఫినైటమ్ మీడియా (Infinitum Media) నిర్మిస్తున్న ఈ సిరీస్ కు.. సాఫ్ట్ వేర్ డెవలపర్స్(Sofetware develovepers) ఫేమ్ సుబ్బు(Subbu) కథ అందిస్తుండగా.. అవినాష్(Avinash) దర్శకత్వం అందిస్తున్నారు.
ఇక తాజాగా రిలీజైన స్టూడెంట్ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. కాలేజ్ టైంలో స్టూడెంట్స్ చేసే అల్లరి, లవ్, ఫ్రెండ్ షిప్ వంటి ఎలిమెంట్స్ ను ఈ సిరీస్ లో చాలా ఫన్నీ వే లో చూపించారు. ఇక షణ్ముఖ్ జశ్వంత్ తన స్టైల్ అఫ్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ఈ సిరీస్ లో షణ్ముఖ్ జశ్వంత్ తో పాటు.. డాన్ పృథ్వీ, పృథ్వీ జకాస్, నేహా పఠాన్, తనూజ మధురపంతుల, తేజస్విని నాయుడు తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించారు.