మల్లికార్జున్‌‌‌‌కు రాష్ట్ర ప్రభుత్వ శ్రమశక్తి అవార్డు

మల్లికార్జున్‌‌‌‌కు రాష్ట్ర ప్రభుత్వ శ్రమశక్తి అవార్డు
  • మంత్రులు వివేక్​, జూపల్లి, ఎంపీ వంశీకృష్ణ చేతుల మీదుగా అందజేత

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనికి చెందిన సీనియర్​ట్రేడ్​ యూనియన్​ లీడర్, లయన్స్​క్లబ్​జోన్‌‌‌‌ చైర్మన్​ పి.మల్లికార్జున్‌‌‌‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డును ప్రకటించింది. మేడే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్​ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్.. మల్లికార్జున్‌‌‌‌కు అవార్డును అందజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నందున ప్రభుత్వం గుర్తించి ఈ ఆవార్డును అందజేసిందని మల్లికార్జున్​ తెలిపారు. 

కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు సజ్జద్, కామ విజయ్​, విజయరావు, తిప్పారపు మధు, తదితరులు పాల్గొని మల్లికార్జున్​కు శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి ప్రాంతానికి చెందిన ట్రేడ్​ యూనియన్​ లీడర్లు వికాస్​కుమార్, టైసన్​ శ్రీనివాస్​, ఆకునూరి బాల​అంకూస్‌‌‌‌కు కూడా శ్రమశక్తి అవార్డులు వచ్చాయి.