- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 168 ఆర్జీలను అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 99 ఫిర్యాదులు
మెదక్టౌన్: ప్రజావాణికి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్నగేశ్అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిందిగా సంబంధిత ఆఫీసర్లకు సూచించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి 99 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖలఅధికారులు పాల్గొన్నారు.
ప్రతీ దరఖాస్తును పరిష్కరించాలి
సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిష్కరించాలని అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. అడిషనల్కలెక్టర్ మాధురి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ..ప్రజావాణికి 59 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
