గొత్తికోయ గ్రామాలకు సోలార్ లైట్లు : కె. వెంకటేశ్వర్లు

గొత్తికోయ గ్రామాలకు సోలార్ లైట్లు : కె. వెంకటేశ్వర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కార్పొరేట్​సామాజిక బాధ్యతలో భాగంగా పలు గొత్తికోయ గ్రామాలకు సింగరేణి ఆధ్వర్యంలో సోలార్​ లైట్లను పంపిణీ చేశామని సింగరేణి కాలరీస్​ కంపెనీ డైరెక్టర్​ కె. వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని పాలవాగు, గడ్డిగుట్ట, జగ్గారం, మర్రిగూడెం గ్రామాల్లో ఎల్​ఈడీ సోలార్​ లైట్లను రుద్రంపూర్​లోని జీఎం ఆఫీస్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన పంపిణీ చేశారు.