
- వర్ని హాస్పిటల్లో స్టూడెంట్స్కు చికిత్స
వర్ని, వెలుగు : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం శివారులోని మోడల్ కళాశాల హాస్టల్లో శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్తో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల సిబ్బంది వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతున్నారు. మోడల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం ప్రణవి నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు.
భోజనానికి ముందు విద్యార్థులకు ఐరన్ మాత్రలు వేశారని, ఉడికీఉడకని అన్నం తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని వారు ఆరోపించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడిందని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి కళాశాలకు వచ్చారని ప్రిన్సిపాల్ చెన్నప్ప తెలిపారు.