దేశంలో ఇవాళ స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

V6 Velugu Posted on Nov 10, 2021

న్యూఢిల్లీ: దేశంలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 11వేల 466 మందికి పాజిటివ్ గా తేలింది. కరోనా కారణంగా మరో 460 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 4లక్షల 61వేల 849 మంది కరోనాతో చనిపోయారు. 1 లక్షా 391వేల 683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 52లక్షల 69వేల 137 డోసుల వ్యాక్సిన్ అందించారు. దేశంలో ఇప్పటివరకు 109 కోట్ల 63లక్షల 59వేల 208 వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగిందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ.

 

Tagged India, Centre, Health ministry, corona, COVID19, cases today, country today

Latest Videos

Subscribe Now

More News