సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్య

V6 Velugu Posted on Aug 02, 2021

హైదరాబాద్: చందానగర్ కైలాష్ నగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్  జంగం అనిల్ కుమార్ సోమవారం తన నివాసంలో లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టీసీఎస్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అనిల్ కుమార్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడని కుటుంబ సభ్యుల సమాచారం. వర్క్ ఫ్రం హోంతో పని ఒత్తిడి పెరగడంతో మానసికంగా కుంగిపోయిన అనిల్ ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య జ్యోతి కూతురి స్కూల్ అడ్మిషన్ కోసం బయటికి వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్య జ్యోతి ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి భర్త ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల సాయంతో మెడికవర్ హాస్పిటల్ కి తీసుకు పోగా అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని గాంధీకి తరలించి కేసు నమోదు చేసినట్లు చందనగర్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జంగం అనిల్ కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లా క్రోసూరు గ్రామం.
 

Tagged Guntur District, Hyderabad Today, , Chandanagar Kailash nagar, anil kumar jangam, software engineer suicide, krosoor village, wife jyothi

Latest Videos

Subscribe Now

More News