ఢిల్లీలో హై టెన్షన్.. ఈసీ కార్యాలయం దగ్గర హై సెక్యూరిటీ

ఢిల్లీలో హై టెన్షన్.. ఈసీ కార్యాలయం దగ్గర హై సెక్యూరిటీ

న్యూఢిల్లీ: ఓట్ చోరీ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‎కు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే సేవ్ డెమొక్రసీ పేరుతో మంగళవారం (అక్టోబర్ 6) ఈసీ కార్యాలయం ముట్టడికి విపక్షాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ నుంచి నిర్వచన్ సదన్ వరకు ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీగా వెళ్లనున్నారు. 

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయనున్నారు. విపక్షాల ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పార్లమెంట్, కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. 

మరోవైపు పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. మరోవైపు.. పార్లమెంట్‎కు వెళ్లే అన్ని మార్గాలను అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. 

పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలు నిలిపివేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పని తీరును నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే ఢిల్లీలో నిరసన చేస్తుండగా.. మరోవైపు విపక్షాలు ఆందోళనకు సిద్ధం కావడంతో నిరసనలతో ఢిల్లీ దద్దరిల్లనుంది.