
- వేశ్యతో గొడవ పడ్డందుకు ఆమె గ్యాంగ్ దాడి
- అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
కూకట్పల్లి, వెలుగు: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై ఓ గ్యాంగ్ కత్తులతో దాడి చేసిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రోడ్డు పక్కన నిల్చున్న వేశ్యతో బేరం కుదుర్చుకునే క్రమంలో తలెత్తిన వివాదం ఈ దాడికి దారితీసింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న మధుగౌడ్(28) సోమవారం రాత్రి కేపీహెచ్‌బీ కాలనీ ఒకటో రోడ్డు గాంధీ విగ్రహం వద్ద నిల్చున్న రవళితో బేరం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రవళి తన సోదరుడు సోహైల్‌కు ఫోన్ చేయడంతో అతను తన గ్యాంగ్‌తో వచ్చాడు.
వారంతా మధుగౌడ్‌పై కత్తులతో దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రవళి, సోహైల్‌తో పాటు సాయికుమార్, సిసిందర్రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అశ్వనీకుమార్సింగ్, షేక్ షరీఫ్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.