GHMC పునర్విభజన..పోలీస్ కమిషనరేట్ల రీషఫిలింగ్

GHMC పునర్విభజన..పోలీస్ కమిషనరేట్ల రీషఫిలింగ్

GHMC పునర్విభజన తర్వాత పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. GHMC పరిధిలోని మూడు పోలీస్ కమిషరేట్లను రీషఫలింగ్ చేశారు.  మొత్తం మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్లు, సైబరాబాద్ లో 3, రాచకొండ కమిషనరేట్ ను 3 జోన్లుగా మార్పులు చేశారు. 

పోలీస్ కమిషనరేట్ల రీషఫలింగ్ లో భాగంగా శంషాబాద్ జోన్ కొత్తగా హైదరబాద్ కమిషనరేట్ కలిపారు. దీంతో పాటు రాజేంద్రనగర్ జోన్ కూడా ఈ కమిషనరేట్ లో మెర్జ్ చేశారు. దీంతో చార్మినార్ జోన్, గోల్కొండ జూన్,   ఖైరతాబాద్ జోన్ , రాజేంద్రనగర్ జోన్ , సికింద్రాబాద్ జోన్ , శంషాబాద్ జోన్లు   హైదరాబాద్  కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. 

మరోవైపు సైబర్ బాద్ పోలీస్ కమిషనరేట్ లో కూడా భారీగా మార్పులు జరిగాయి.  ఈ కమిషనరేట్ పరిధిలో శేరలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉండగా.. మొయినాబాద్ నుంచి పటాన్ చెరు వరకు శేరిలింగంపల్లి జోన్ లో కలిపారు. మాదాపూర్ ను కూకట్ పల్లి లో జోన్ లో కలిపారు. కుత్బుల్లాపూర్ యథాతధంగా ఉంది. 

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజ్ గిరి, ఉప్పల్ జోన్లు ఉన్నాయి. ఇంతకుముందు ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి  జిల్లా ప్రాంతాలను యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిలోకి రానున్నాయి. మరోవైపు మహేశ్వరం జోన్, షాద్ నగర్, చేవెళ్లజోన్లను కలుపుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ గా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు పోలీసు శాఖ తెలిపింది.