మహేంద్రగిరిలోని ఇస్రోకు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 100.
విభాగాల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (ఇంజినీరింగ్) 41, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (నాన్ ఇంజినీరింగ్) 15, టెక్నీషియన్ అప్రెంటీస్ 44.
ఎలిజిబిలిటీ: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (ఇంజినీరింగ్)కు సంబంధిత విభాగంలో బి.టెక్./ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (నాన్ ఇంజినీరింగ్)కు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్‌కు సంబంధిత విభాగంలో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
లాస్ట్ డేట్: 2026, జనవరి 11.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iprc.gov.in వెబ్‌సైట్‌ని సంప్రదించండి.
