హిందువులకు ఎంతో ముఖ్యమైన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. ముక్కోటి ఏకాదశి అని కూడా పిలిచే ఈ పవిత్ర రోజున, విష్ణుమూర్తి ఆశీస్సుల కోసం భక్తులు ఉపవాస దీక్ష పాటిస్తారు. పురాణాల ప్రకారం ముక్కోటి ఏకాదశి రోజు . కొన్ని వస్తువులను దానం చేస్తే కోటిరెట్లు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక సమస్యలు అన్నీ మాయం అయి ధనలాభం కల్గుతుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం తమ రాశికి తగ్గట్లుగా ఆయా వస్తువులను దానం చేయాలి. అయితే ఏ రాశి వారు ఏం దానం చేయాలో తెలుసుకుందాం.
ముక్కోటి ఏకాదశి రోజు ( డిసెంబర్ 30) ఉపవాసం ఉండి శ్రీమహా విష్ణువును భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. ఆరోజు దేవాలయాల్లో ఉత్తరద్వార దర్శనం చేస్తారు. ఇలా పాటించడం వల్ల కీర్తి పెరుగుతుంది. అలాగే మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కల్గుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. . .
- మేష రాశి : ఎరుపు బట్టలు, తామ్రడ పాత్రలు, కుంకుమ, బెల్లం
- వృషభ రాశి : తెల్ల బట్టలు, పప్పు, సుగంధ, మహాలక్ష్మి దేవాలయంలో వెండి వస్తువులు
- మిథున రాశి : బట్టలు, ఆకుపచ్చ పండ్లు, పాత్రలు, శంఖాలు, నాణేలు
- కర్కాటక రాశి: పప్పు, బియ్యం, వస్తువులు, తెల్లని రంగు బట్టలు, పసుపురంగు స్వీట్స్
- సింహ రాశి : శంఖ చిప్పలు, వెండి, లక్ష్మి నారాయణ దేవాలయంలో పూజకు ఉపయోగపడే వస్తువులు
- కన్యా రాశి : ఆకుపచ్చ పండ్లు, వస్త్రాలు, బియ్యం, మినుములు
- తులా రాశి : శివాలయంలో పాలు, తెల్లని వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, పూలు, స్వీట్
- వృశ్చిక రాశి : ఎరుపు స్వీట్లు, కేసరి, బెల్లం, ఎరుపు బట్టలు, ఎర్రని పూలు ( దేవాలయంలో పూజకు)
- ధనుస్సురాశి: పసుపు బట్టలు, పండ్లు, బ్రాహ్మణులకు స్వయంపాకం
- మకర రాశి: నూనె, నీలి రంగు బట్టలు, నల్ల నీలి వస్త్రాలు, స్వీట్లు, శనగపిండి లడ్డూలు, పుస్తకం, పెన్సిల్, పెన్నులు
- కుంభ రాశి: బార్లీ, నీలం వస్త్రాలు, నల్ల బట్టలు ,నువ్వులు , బెల్లం, బియ్యం,
- మీన రాశి : పసుపు రంగు స్వీట్లు, శనగపిండి లడ్డులు, పుస్తకం, పెన్సిల్, పెన్ను, శనగలు, బట్టలు
ఈ దానాలన్నీ భక్తితో, మనస్ఫూర్తిగా చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని .. ఆర్థిక సమ్యలకు పరిష్కారం లబిస్తుందని పురాణాలు, జ్యోతిష్య శాస్త్రంద్వారా తెలుస్తుంది. . .!
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
