ఎల్లారెడ్డిపేట మండలంలో సర్పంచుల ఫోరం ఎన్నికలో హైడ్రామా

ఎల్లారెడ్డిపేట మండలంలో  సర్పంచుల ఫోరం ఎన్నికలో హైడ్రామా
  •     ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడిగా తొలుత ప్రకటించుకున్న బీఆర్ఎస్​సర్పంచ్​  
  •     తర్వాత కాంగ్రెస్​సర్పంచ్​నర్సయ్య ఎన్నిక

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హైడ్రామా నడిచింది. శనివారం సర్పంచుల  ఫోరం ఎన్నిక పూర్తయిందని, తాను​అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు బీఆర్ఎస్ బలపర్చిన తిమ్మాపూర్ సర్పంచ్ అందె సుభాష్ ప్రకటించుకున్నారు. మండలంలో మొత్తం 26 గ్రామాలున్నాయి. అధ్యక్షుడి ఎన్నికకు 14 మంది సర్పంచులు కావాల్సి ఉండగా.. 13 మందితోనే ప్రకటించుకోవడం ఏంటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.

అనంతరం రాజకీయ పరిణామాల మధ్య ప్రెస్ క్లబ్ లో 14 మందితో నారాయణపూర్ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య అధ్యక్షుడిగా, మెడిశెట్టి పద్మ ప్రధాన కార్యదర్శిగా , ధరావత్ నిర్మల ఉపాధ్యక్షురాలిగా, చెన్నమేని మౌనిక, బోనాల మణెమ్మ కార్యదర్శులుగా కొత్త కార్యవర్గం ఏర్పాటైంది.