కరీంనగర్ లోని ‘సైబర్ క్రైం పోలీసులు వేధిస్తున్నరు’ అని రమణ స్వప్న దంపతులు ఆవేదన

కరీంనగర్ లోని ‘సైబర్ క్రైం పోలీసులు వేధిస్తున్నరు’ అని రమణ స్వప్న దంపతులు ఆవేదన

కరీంనగర్ క్రైం, వెలుగు: క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లావాదేవీల్లో అమాయకుడైన తమ కొడుకును ఇరికించి జైలుకు పంపడమే కాకుండా.. రూ.11 లక్షలు చెల్లించాలని సైబర్​క్రైం పోలీసులు వేధిస్తున్నారని కరీంనగర్ లోని జ్యోతినగర్‌‌‌‌కు చెందిన వంగల రమణ–స్వప్న దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తమ కుమారుడు సాయి మణిదీప్‌‌‌‌కు దాసరి రమేశ్​ట్రైనింగ్ ఇచ్చి రూ.కోట్లలో మోసాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. 

సాయి మణిదీప్‌‌‌‌ వద్ద కూడా రూ.25 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. ఈ కేసులో దాసరి రమేశ్​తోపాటు తమ కొడుకుని పోలీసులు అరెస్ట్​ చేసి జైలుకు పంపారని చెప్పారు. సైబర్ క్రైం పోలీసులు, రమేశ్​ కుమ్మక్కై కేసు నుంచి బయట పడాలంటే రెండు రోజుల్లో రూ.11 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని వాపోయారు.