నేను ఫైటర్‌‌‌‌‌‌‌‌ని: బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ సంజనా గల్రానీ

నేను ఫైటర్‌‌‌‌‌‌‌‌ని: బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ సంజనా గల్రానీ

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌‌‌‌గా మెప్పించిన సంజనా గల్రానీ.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొని టాప్ ఫైవ్‌‌‌‌లో నిలిచిన  సంగతి తెలిసిందే. తనకు సపోర్ట్‌‌‌‌గా నిలిచిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంజనా మాట్లాడుతూ ‘ఓ ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని, కెరీర్‌‌‌‌‌‌‌‌ని ఒక కుదుపు కుదిపేసింది.

అయితే స్వతహాగా  నేను ఫైటర్‌‌‌‌‌‌‌‌ని కావడంతో ప్రతికూల పరిస్థితులతో పెద్ద పోరాటమే చేశాను. బిగ్ బాస్ షో నుంచి  ఎంతో నేర్చుకున్నా. ఈ అనుభవంతో నా కెరీర్‌‌‌‌‌‌‌‌ను  ఫ్రెష్ ఇన్నింగ్స్‌‌‌‌తో స్టార్ట్ చేయదలచుకున్నా. జీవితంలో మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్‌‌‌‌కి ఎప్పటికీ ఋణపడి ఉంటాను’ అని అన్నారు.