- మూడు నెలల టార్గెట్విధించిన డైరెక్టర్
జైపూర్, వెలుగు: మూడు నెలల్లో 15 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీయాలని డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం ఆయన ఏరియా జీఎంతో కలిసి ఇందారం ఓపెన్ కాస్టును సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని, ఇందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలన్నారు.
ఉపరితల గనులకు కావాల్సిన యంత్ర సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. ఓసీ పీవో వెంకటేశ్వర్ రెడ్డి, గని మేనేజర్ల్ నాగన్న, శంకర్, వరాహ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
