స్వచ్ఛమైన ప్రేమ కథతో ‘కాగితం పడవలు’

స్వచ్ఛమైన ప్రేమ కథతో ‘కాగితం పడవలు’

ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో నరేష్ టీఆర్, ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్న చిత్రం ‘కాగితం పడవలు’. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా శర్వానంద్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ని రిలీజ్ చేసి ఈ సినిమా సక్సెస్ సాధించాలని టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు.

‘ప్రేమ నిప్పు లాంటిది. అది రెండు జీవితాలకు వెలుగునిచ్చే దీపం అవ్వచ్చు, లేదా అడవిని దహించే కార్చిచ్చుగా మారొచ్చు’ అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  ప్రేమకథలోని డెప్త్ ఆడియెన్స్‌‌‌‌కి కనెక్ట్ అవుతోంది.  లీడ్ పెయిర్ వర్ధన్, కృష్ణప్రియ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. స్క్రీన్‌‌‌‌పై వారి ఎమోషన్స్ హార్ట్ టచింగ్‌‌‌‌గా ఉన్నాయి.  ఈ చిత్రానికి ఏఐఎస్ నౌఫల్ రాజా సంగీతం అందిస్తున్నాడు.