లయన్ కింగ్, అలాద్దిన్, మహావతార్ నరసింహ లాంటి యానిమేషన్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోవలో ‘కికి & కొకొ’టైటిల్‌తో మరో యానిమేషన్ మూవీ ఇండియన్ స్ర్కీన్‌పైకి రాబోతోంది. పి. నారాయణన్ దర్శకత్వంలో ఇనికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. బాలనటి శ్రీనిక కొకొ పాత్రలో నటిస్తోంది. మీనా చాబ్రియా సీయీవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ యానిమేషన్ మూవీ త్వరలో థియేటర్స్‌తో పాటు 9 భాషల్లో ఓటీటీలోకి రాబోతోంది.
శనివారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పి.నారాయణన్ మాట్లాడుతూ ‘ఇది పిల్లలకే పరిమితం కాదు. అందరికీ మెమొరబుల్ మూమెంట్స్‌ను అందించే చిత్రం. చిన్నారుల వినోదం, విద్యకు కొత్త నిర్వచనం చూపే వినూత్న చిత్రం’ అని చెప్పారు. ఇదొక సినిమా మాత్రమే కాదని, స్నేహం, ప్రేమ, కథల ద్వారా పిల్లలు నేర్చుకునే విలువైన పాఠాల వేదిక అని క్రియేటివ్ ప్రొడ్యూసర్ జి.యం.కార్తికేయన్ అన్నారు. బాలనటి శ్రీనిక, క్రియేటివ్ డైరెక్టర్ గోకుల్ రాజ్ భాస్కర్, సీయీవో మీనా చాబ్రియా, ప్రొడ్యూసర్ ధరణి పాల్గొన్నారు.
