సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘటనలో కొత్తకోణం

సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘటనలో కొత్తకోణం

సాఫ్ట్వేర్ ఇంజనీర్ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. నారాయణరెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న నారాయణరెడ్డిని మామ వెంకటేశ్వర్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు.  ఘనంగా మళ్లీ పెళ్లి చేస్తామంటూ ఢిల్లీలో ఉన్న కుమార్తె, అల్లుడిని పిలిపించి కుమార్తెను గృహనిర్బంధం చేశాడు. వేరే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెట్టగా ఆమె నిరాకరించడంతో అల్లుడి హత్యకు ప్లాన్ చేశాడు. 

శ్రీనివాస్ రెడ్డి, ఆశిక్, కాశీలకు ఐదు లక్షల సుపారీ ఇచ్చి నారాయణ రెడ్డిని హత్య చేయాలని వెంకటేశ్వర్ రెడ్డి చెప్పాడు. దీంతో జూన్ 27న నారాయణరెడ్డిని నిందితులు కారులో ఎక్కించుకొని వెళ్తుండగా టవల్ తో మెడకు ఉచ్చుగా వేసి హతమార్చారు. ఆ తర్వాత జిన్నారం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అనంతరం నారాయణరెడ్డిని చంపేసినట్లు ఫోన్ ద్వారా వెంకటేశ్వర్ రెడ్డికి సమాచారం అందించింది సుపారి గ్యాంగ్. కాల్ డాటా ఆధారంగా పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.