జపాన్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

జపాన్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు జపాన్ రాజధాని టోక్యోకు వెళ్లారు ప్రధాని మోడీ. రెండ్రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్లిన మోడీకి ఘన స్వాగతం లభించింది. మోడీ స్టే చేయనున్న హోటల్ న్యూ ఒటానీ దగ్గర మోడీ.. మోడీ..  భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేశారు ప్రవాస భారతీయులు. వివిధ బాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులు పట్టుకుని మోడీకి స్వాగతం పలికారు చిన్నారులు
స్వాగతం పలికేందుకు వచ్చిన చిన్నారులతో మాట్లాడారు మోడీ. భారతీయ పిల్లలతో పాటు పలువురు జపాన్ కిడ్స్ ప్రధాని ఆటోగ్రాఫ్ కోసం వేచిచూశారు. జపాన్ బాలుడు తెచ్చిన కార్డు పైన ఆటోగ్రాఫ్ ఇచ్చారు. హిందీ ఎక్కడ నేర్చుకున్నావు ... నీకు బాగా తెలుసా.. అని జపాన్ చిన్నారితో  మాట్లాడారు మోడీ. ప్రధాని మోడీ ఎన్ఈసీ కార్పొరేషన్ ఛైర్మన్ నోబుహిరో ఎండో, సీఈవో తదాషి యానే, సుజుకి మోటర్ కార్పొరేషన్ సలహాదారు ఒసామ్ సుజుకీ, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ యసయోషి సన్ లతో సమావేశం కానున్నారు. రేపు క్వాడ్ సమ్మిట్ లో పాల్గొననున్నారు.