పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును శనివారం దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీ చైర్మన్ కిహాక్ సూంగ్, వైస్ చైర్మన్ మిన్ సుకిలీ, ప్రతినిధులు శనివారం ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి సందర్శించారు. నిర్మాణ పనులతో పాటు ఇప్పటికే తయారైన ఉత్పత్తులు, నాణ్యతను పరిశీలించేందుకు వచ్చారు.
కాగా, మొంథా తుఫాను ప్రభావంతో పార్కులోని పలు రోడ్లు ధ్వంసం కావడంతో పాటు పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద ఉధృతితో భవిష్యత్తులో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా? అనే అంశంపై ఆరా తీరా తీసినట్లు సమాచారం. కంపెనీ చైర్మన్ రావడంతో ఎవరినీ లోపలికి అనుమతించలేదు. తహసీల్దార్ రియాజుద్దీన్, సీఐ విశ్వేశ్వర్ పాల్గొన్నారు.
