రైల్వేలో 3,134 అప్రెంటిస్ ​జాబ్స్

రైల్వేలో 3,134 అప్రెంటిస్ ​జాబ్స్

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్‌‌ రైల్వే 3,134 అప్రెంటిస్‌‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌‌టీ, కార్పెంటర్, మెషినిస్ట్, వైర్‌‌మెన్‌‌ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

అర్హత

కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌‌లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. స్టైపెండ్‌‌ నెలకు రూ.5500 నుంచి రూ.7000 చెల్లిస్తారు.

సెలెక్షన్ 

షార్ట్‌‌లిస్టింగ్, అకడమిక్‌‌ మెరిట్, మెడికల్‌‌ ఎగ్జామినేషన్‌‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్​లైన్​ ద్వారా అక్టోబర్​ 31 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.sr.indianrailways.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.