దక్షిణ రాష్ట్రాలు 2026 నుంచి 2030 మధ్య ఏటా సగటున 6.8 శాతం వృద్ధిని సాధించాయని డెజర్వ్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. కర్ణాటక 7.4 శాతం, తెలంగాణ 7.2 శాతం వృద్ధితో మొదటిస్థానంలో నిలుస్తాయని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. దేశ ఆర్థిక కేంద్రం దక్షిణాదికి మారుతోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం వాటా 13 శాతం ఉండగా, కర్ణాటక వాటా 22 శాతం ఉంది. మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ లో రూ.1.46 లక్షల కోట్లు, గూగుల్ సంస్థ విశాఖపట్నంలో రూ.51 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. తమిళనాడు 16 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. వచ్చే దశాబ్ద కాలంలో దేశ వృద్ధికి ఈ రాష్ట్రాలే ప్రధాన చోదక శక్తిగా నిలుస్తాయని రిపోర్ట్ వివరించింది.
