
- ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డిటౌన్, వెలుగు : సైబర్ నేరాల నివారణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. గురువారం జిల్లాలో సైబర్ వారియర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వారికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారు సప్లయ్ చేసిన టీ షర్టులను పంపిణీ చేసి మాట్లాడారు. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవాలని, ప్రతి కేసును సీరియస్‌గా తీసుకోవాలన్నారు.
బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ ఎంతో కీలకమన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, లింకులు, అప్లికేషన్లు వినియోగించటం, చెప్పటం చేయవద్దన్నారు. సోషల్ మీడియా ప్రకటనలపై ప్రజలు అలర్టుగా ఉండాలన్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సైబర్ క్రైమ్ జిల్లా నోడల్ అధికారి టి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.