V6 News

2 వేల మందితో భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ శరత్ చంద్ర పవార్

2 వేల మందితో భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ శరత్ చంద్ర పవార్
  • ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్గొండ,  వెలుగు: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నల్గొండ రూరల్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన అప్పాజీపేట గ్రామాన్ని సందర్శించారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  మొదటి విడతలో భాగంగా 318 గ్రామ పంచాయతీల్లో 466 పోలింగ్ కేంద్రాలు, 2870  పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి మండలానికి సూమరు 150 నుంచి 2 వేల మంది పోలీస్ సిబ్బందితో  రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

 జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి  క్రిటికల్ పోలింగ్ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించాలన్నారు.  ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.