తిట్టింది నా తల్లిని.. నాకు ఆవేశముంటది: అసెంబ్లీలో హరీశ్రావుపై స్పీకర్ ఫైర్

తిట్టింది నా తల్లిని.. నాకు ఆవేశముంటది: అసెంబ్లీలో హరీశ్రావుపై స్పీకర్ ఫైర్
  • మీరు లొల్లి చేస్తే భయపడాలా..?.. అసెంబ్లీలో హరీశ్​రావుపై స్పీకర్ ఫైర్
  • మహిళా ఎమ్మెల్యేల అంశంపై రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటానని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీలో తాను మాట్లాడుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించడంతో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌‌ లీడర్‌‌ హరీశ్‌‌రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తిట్టింది నా తల్లిని.. నాకు ఆవేశం ఉండాలె.. మీకెట్లా ఉంటది, మీ తల్లిని అనలేదు’ అంటూ హరీశ్‌‌పై మండిపడ్డారు. అసెంబ్లీలో మీరు లొల్లి చేస్తే భయపడాలా అంటూ ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో తాను మాట్లాడుతున్న సమయంలో హరీశ్‌‌రావు అడ్డంకులు సృష్టించడంతో తీవ్రంగా స్పందించారు.

‘‘మీరు చెబుతుంటే నేను వినడం లేదా? మీకెందుకింత ఆవేశం? నాకుండాలి ఆవేశం.. మీక్కా దు. నా తల్లిని తిట్టారు.. మీ తల్లిని అనలేదు. నాకుండాలి ఆవేశం.. నీకెట్ల ఉంటది? మీరు చేసింది కరెక్టేనా? వినండి నా మాటలు. మీరు లొల్లి చేస్తే నేను భయపడాలా?’ అని హరీశ్‌‌రావును ప్రశ్నించారు.

సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి అంటే తనకెంతో గౌరవమన్నారు. తనకు ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారని, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తన అక్కాచెల్లెళ్లేనని చెప్పారు.  సోమవారం అసెంబ్లీ బయట వాళ్లపై దాడి జరిగిందంటూ వార్తలు వచ్చిన వెంటనే పోలీస్ అధికారులను రిపోర్టు అడిగానని, ఆ రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.