కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) 26 క్రీడా విభాగాల్లో అసిస్టెంట్ కోచ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు: అసిస్టెంట్ కోచ్.
మొత్తం ఖాళీలు: 323 (26 క్రీడా విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన భారతీయ/ విదేశీ విశ్వవిద్యాలయం నుంచి కోచింగ్‌లో డిప్లొమా లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 23.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.2500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు, మహిళా అభ్యర్థులకు రూ.2000.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 21.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కోచింగ్ ఎబిలిటీ టెస్ట్ (సీఏటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. క్రీడలకు సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానం (65 మార్కులు), క్రీడా విజ్ఞానం (25 మార్కులు), సాధారణ అవగాహన/ రీజనింగ్/ ఆప్టిట్యూడ్ (10 మార్కులు) ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉన్నాయి.
సీఏటీ: కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను 1: 3 నిష్పత్తిలో కోచింగ్ ఎబిలిటీ టెస్టుకు ఎంపిక చేస్తారు.
తుది ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు 40 శాతం వెయిటేజీ, కోచింగ్ ఎబిలిటీ టెస్టుకు 60 శాతం వెయిటేజీ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ sportsauthorityofindia.nic.inను సందర్శించండి.
