కరీంనగర్ సిటీ, వెలుగు: పదో తరగతి ఫలితాలలో కరీంనగర్ సిటీలోని శ్రీ చైతన్య హైస్కూల్ బోయవాడ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. ఈగం నాగరాణి, పంజాల వర్షిత్ 583 మార్కులు చొప్పున సాధించడంతోపాటు స్కూల్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రిన్సిపల్ పద్మజా విద్యార్థులను అభినందించారు. ఏజీఎం రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ విజయకృష్ణ పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్ : జగిత్యాల పోచమ్మ వాడలోని శ్రీ చైతన్య కాన్సెప్ట్ హైస్కూల్ విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో తమ సత్తా చాటారు. వి.శ్రీరామ్ 584, మర్రి వైష్ణవి 576, బి.రితిక 576, డి.రాజహంసిక 574, పి.రుతిక్ రావు 574, బి.హర్షిత 573, ఎ.రోషిణి 570, ఎస్.ప్రియమణి 570, కె.సాయి సృజన 570, ఎన్.ప్రసన్న 569 మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ గంగారెడ్డి, డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

