హుజూర్ నగర్, వెలుగు: ఈ నెల15 నుంచి 19 వరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువులో జరిగే శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర మహాశివరాత్రి జాతర ఆహ్వాన పత్రికను బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ క్యాంప్ కార్యాలయంలో పాలక మండలి సభ్యులు అందజేశారు.
అనంతరం జాతీయ స్థాయి ఎద్దుల పోటీల వాల్ పోస్టర్ ను మంత్రి ఉత్తమ్ ఆవిష్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య, ఈవో శంబి రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
