కుత్బుల్లాపూర్లో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి

కుత్బుల్లాపూర్లో  వీధికుక్కల దాడిలో  చిన్నారి మృతి

కుత్బుల్లాపూర్  పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ కుటుంబం రోధిస్తుంది.  

 గాయత్రి నగర్ లో ఏప్రిల్ 12న   సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నర ఏండ్ల దీపాలి అనే చిన్నారిపై వీధి కుక్కల దాడి చేశాయి.  తీవ్రంగా గాయాలైన  పాపను చికిత్స కోసం ఉస్మానియా  ఆసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతున్న చిన్నారి ఇవాళ(ఏప్రిల్ 13)ఆస్పత్రిలో  మృతి చెందింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వీధి కుక్కల దాడి ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలపై ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చినా   జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవం లేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.