
- స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
మియాపూర్, వెలుగు: వారం రోజుల వ్యవధిలో ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం స్కూల్ మేనేజ్మెంటేనని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం మియాపూర్ సెయింట్ మార్టిన్స్ స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. పదో తరగతి చదువుతున్న హన్సిక తాము నివాసముంటున్న బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అంతకుముందు అదే తరగతికి చెందిన రిజ్వాన్ స్కూల్ పైనుంచి దూకాడన్నారు.
ఈ ఘటన తరువాత హన్సికను స్కూల్కు అనుమతించకపోవడం, రిజ్వాన్ పేరెంట్స్ తిట్టడం వల్ల ఆమె బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి బిజాయ్ నాయక్ ఫిర్యాదు మేరకు స్కూల్ యజమాన్యం, రిజ్వాన్ తల్లిదండ్రులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.