ధూళి నివారణకు సరికొత్త పరికరాలను సమకూర్చుకోవాలి : అజయ్ యాదవ్

ధూళి నివారణకు సరికొత్త పరికరాలను సమకూర్చుకోవాలి : అజయ్ యాదవ్
  • సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ 

సత్తుపల్లి, వెలుగు: సింగరేణి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వద్ద వెలువడే దుమ్ము దూళి నియంత్రించేందుకు విదేశీ పరిజ్ఞానంతో కూడిన అధునాతన పరికరాలను సమకూర్చుకోవాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సింగరేణి అధికారులకు సూచించారు. 

మంగళవారం ఆయన జేవీఆర్ ఓపెన్ కాస్ట్ పరిధిలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బొగ్గుని లోడింగ్ చేసే ప్రాంతాన్ని, శైలో రాపిడ్ లోడింగ్ సిస్టంను గమనించారు.  బొగ్గు లోడింగ్, రవాణా ఎంత వేగవంతంగా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్ సత్యనారాయణ, పీవో ప్రహ్లాద్, సీహెచ్‌పీ ఇన్‌ చార్జి డీజీఎం సోమశేఖర రావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.