రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

భద్రాచలం, వెలుగు: రాములోరికి శనివారం సువర్ణ తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. అంతకుముందు గోదావరి నుంచి తీర్థ బిందెను తీసుకొచ్చి సుప్రభాత సేవ, రామపాదుకలను భద్రుని మండపానికి తీసుకెళ్లి అభిషేకం చేశారు. 

కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిపారు.  సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు. ఈవో బదిలీ, కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మూడు రోజుల శ్రీసీతారామచంద్రస్వామి ఆభరణాల లెక్కింపు, అప్పగింతల కార్యక్రమం శనివారం ముగిసింది.