చంద్రబాబు గెలవాలని పూజలు చేశా.. స్వరూపానంద స్వామి సెన్సేషనల్ కామెంట్స్

చంద్రబాబు గెలవాలని పూజలు చేశా.. స్వరూపానంద స్వామి సెన్సేషనల్ కామెంట్స్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ  కూటమి అధికారంలోకి రావడం ఆనందమని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనదని చెప్పారు. ప్రజలకు మేలు కలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వాదిస్తున్నామని తెలిపారు. కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నామని కోరారు. అమరావతిలో కూడా శారదా పీఠం నిర్మిస్తామని తెలిపారు. 

ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. త్వరలోనే చాతుర్యాస పూజలకోసం రుషికేశ్ వెళ్తున్నా, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నాని వెల్లడించారు. హైదరాబాద్ లోని శారదా పీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నామని చెప్పారు. తనకు అత్యంత ఆత్మీయుడు ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషకరమని చెప్పారు. 

అమ్మ వారి కృప చేత మోదీ మూడో సారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించిందన్నారు. చంద్రబాబు ను కొత్తగా పొగుడుతూ ఉన్నానని అనుకోవద్దని  ఆయన గెలవాలని గతంలో మురళీమోహన్ తో కలిసి సాధువులందరితో కలిసి సమావేశం పెట్టీ పూజలు చేశామన్నారు. చంద్రబాబు అంటే చాలా గౌరవం ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఈ సారైనా దేవాలయాల పాలన బాగుండాలని స్వరూపానంద స్వామి చెప్పారు.