
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని మెహదీపట్నం అంధ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్పాక పలు వస్తువులు పంపిణీ చేశారు. పడుకోవడానికి చాపలు, తుడుచుకోవడానికి తువ్వాళ్లు లేక వారు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన చాపలు, తువ్వాళ్లు అందజేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రమేశ్పాక మాట్లాడుతూ.. అనాథ, దివ్యాంగ, అంధ విద్యార్థులకు మౌలిక వసతులు సమకూర్చేందుకు ప్రతీఒక్కరు ముందుకురావాలని కోరారు.