
క్యాసినో వ్యవహరంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నట్టుగా వస్తున్న వార్తల పై సాయికిరణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈడీ తనకు ఎలాంటి నోటీసులు పంపలేదన్నారు. తన మీద వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఏదైనా వార్తను ప్రదర్శించే ముందు వాస్తవాలను తనిఖీ చేయాలని అన్ని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
తాను యువ రాజకీయ నాయకుడినని, ప్రజలకు తనవంతుగా సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నానని ట్వీట్ లో తెలిపారు. ఈ వ్యవహరంలో ఈడీ ఇప్పటికే తలసాని బ్రదర్స్ ని విచారించింది. ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్ కూడా ఈడీ ఎదుట హజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ విచారణకు హరీశ్ హాజరు ఆయినట్లుగా తెలుస్తోంది.