న్యూఢిల్లీ: ఆంధ్రాలోని నెల్లూరులో సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ముందుకొచ్చింది. 10 గిగావాట్ కెపాసిటీ ఉన్న గ్రీన్‌ఫీల్డ్ ఇంగాట్ అండ్ వేఫర్ తయారీ ప్లాంట్‌ను రూ.6,675 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ సిలికాన్‌ను శుద్ధి చేసి అతిపెద్ద బ్లాక్‌లుగా మారుస్తారు. తర్వాత ఈ వేఫర్లతో చిప్‌లు తయారు చేస్తారు.
ఈ ప్లాంట్‌ను ఐఎఫ్‌ఎఫ్‌సీఓ కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం 200 ఎకరాల భూమిని కేటాయించింది. డైరెక్ట్‌గా వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. కరెంట్ కోసం 200 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుంది.
