టీబీ వ్యాధికి భయపడొద్దు :ఉషారాణి

టీబీ వ్యాధికి భయపడొద్దు :ఉషారాణి
  • టీబీ స్టేట్ టెక్నికల్ ఆఫీసర్ ఉషారాణి 

కామేపల్లి, వెలుగు: టీబీ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భయపడాల్సిన పని లేదని ప్రభుత్వ ఆసుపత్రుల్లో  చికిత్స లభిస్తుందని టీబీ స్టేట్ టెక్నికల్ ఆఫీసర్ ఉషారాణి అన్నారు.  కామేపల్లి రైతు వేదికలో టీబీ అలెర్ట్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం పీడియాట్రిక్ టీబీపై అవగాహన సదస్సు జరిగింది. 

పుట్టిన దగ్గర నుంచి14  సంవత్సరాల లోపల బాలబాలికలకు వచ్చే టీబీ వ్యాధి లక్షణాలు నివారణ మార్గాల గురించి ఆమె వివరించారు. మండల వైద్యాధికారిణి శిరీష అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా టీబీ కోఆర్డినేటర్ ప్రభాకర్, హెచ్ఈ ఓ  కే . వెంకటేశ్వర్లు, సూపర్‌‌వైజర్స్‌ శ్రీనివాస్, రాధాకృష్ణ,  నరేందర్, స్టాఫ్ నర్స్ పుష్పలత, ల్యాబ్ టెక్నిషీయన్ ఉమా మహేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.