మేడిపల్లి, వెలుగు: సాయి ఈశ్వర్ అంత్యక్రియలకు వెళ్లడానికి సిద్ధమవుతున్న తీన్మార్ మల్లన్నను పీర్జాదిగూడలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం 5 గంటలకు మల్లన్న ఇంటికి వెళ్లిన మేడిపల్లి, పోచారం పోలీసులు ఆయనను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. సాయి ఈశ్వర్ ఆత్మహత్య విషయాన్ని ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉందని, ఇలాంటి నిర్బంధ వైఖరిని ప్రభుత్వ మార్చుకోవాలన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చేవరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.
