తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ ప్రారంభమైంది

తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ ప్రారంభమైంది

తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ పట్టాలెక్కింది. ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) నడుపుతున్న తేజాస్‌ రైలు 2019 అక్టోబరులో ప్రారంభమైంది. తర్వాత కరోనా కారణంగా ఇన్నాళ్లు రద్దయింది. తిరిగి ఇవాళ(శనివారం) పున: ప్రారంభమయింది. అహ్మదాబాద్‌-ముంబై,లక్నో-న్యూఢిల్లీల మధ్య తేజాస్‌ రైలు రాకపోకలు సాగించనుంది. అత్యంత వేగంగా నడిచే ఈ రైలు ప్రయాణికులకు ఉచితంగా రూ.25 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. 78 సీట్ల సామర్ధ్యం ఉన్న ఏసీ ఛైర్‌ కార్‌ బోగీలో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తారు. ఈ రైలులో ఆర్వో వాటర్‌ ఫిల్టరుతో పాటు ప్యాకేజేడ్‌ వాటర్‌ బాటిళ్లను కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు.