బురాన్పల్లిని దత్తత తీసుకుంటా

 బురాన్పల్లిని దత్తత తీసుకుంటా
  • గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా
  • అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్

వికారాబాద్, వెలుగు: గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే.. రాష్ట్రాన్ని శరవేంగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ అన్నారు. శుక్రవారం వికారాబాద్  మండలంలోని బురాన్ పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బురాన్ పల్లి వరకు బీటీ రోడ్డు, బురాన్ పల్లి నుంచి ధన్నారం వరకు బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బురాన్​పల్లిని తాను దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. 

కాంగ్రెస్​ ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తోందన్నారు. మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మి తులం బంగారం త్వరలోనే ఇస్తామని చెప్పారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన మొక్కలు నాటేందుకు ప్రొసీడింగ్ కాపీలను మహిళా లబ్ధిదారులకు అందజేశారు. డీఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో వినయ్ కుమార్, పంచాయతీ రాజ్ డీఈ శ్రీనివాస్  పాల్గొన్నారు.