సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు

సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు

వికారాబాద్​, వెలుగు: సీఎం ఓవర్సీస్ స్కాలర్​షిప్​కు  పథకం కింద 2025 సీజన్​కు సంబంధించి విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్/పీహెచ్‌డీ చదువుతున్న మైనారిటీ విద్యార్థుల (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి ఎస్. రాజేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు www.telanganaepass.cgg.gov.in వెబ్​సైట్​లో జనవరి 19 సాయంత్రం 5 గంటల వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. 

అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీ, అవసరమైన ధ్రువపత్రాలను జనవరి 20 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి ఇవ్వాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్షిప్, రూ.60 వేల వన్​-వే విమాన చార్జీని ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. వివరాలకు 7993357103, 9912144364 నంబర్లని సంప్రదించాలన్నారు.