గ్రామీణ క్రికెటర్లకు టీసీఏ ప్రోత్సాహం : డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్

గ్రామీణ క్రికెటర్లకు టీసీఏ ప్రోత్సాహం : డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్
  • తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్

ఖమ్మం టౌన్,వెలుగు :  తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కు ముందస్తుగా ఐదు జోన్ల నుంచి ఒక్కో జట్టును ఈనెల 18 నుంచి ఆయా జోన్లలో ఓపెన్ సెలక్షన్స్ జరుగుతాయని టీసీఏ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, వీరేశ్​ గౌడ్ తెలిపారు. గురువారం ఖమ్మం లోని సీక్వెల్ రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈస్ట్ జోన్ పరిధిలోకి వచ్చే ఖమ్మం భద్రాది కొత్తగూడెం, సూర్యాపేట, కోదాడ, మహబూబాబాద్, వరంగల్, భూపాల్ పల్లి, ములుగు, పరకాల, హనుమకొండ, స్టేషన్ ఘన్​పూర్ జిల్లాల నుంచి ఆరు క్రికెట్ జట్లను సెలక్షన్ చేసి ఫైనల్ టోర్నమెంట్ కు పంపిస్తామన్నారు. 18 నుంచి ఖమ్మం జిల్లా వేపకుంట్ల గ్రామంలోని ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ లో ఉదయం 9 గంటల నుంచి ఓపెన్ సెలక్షన్ నిర్వహిస్తామని చెప్పారు. 

సెలక్షన్ కు వచ్చే అభ్యర్థులు తమ పుట్టిన తేదీని ధ్రువీకరించే ఆధార్ కార్డు,  పాన్ కార్డు, టెన్త్​ మెమోలో ఏదైనా ఒకటి తీసుకు రావాలని కోరారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సెంట్రల్ జోన్లు కలుపుకొని మొత్తం ఐదు జోన్ల నుంచి ఒక్కోజోన్ తరఫున ఆరు జట్లను ఎంపిక చేసి మొత్తం 30 జట్లతో కలిపి గోల్డ్ కప్ టోర్నమెంటుకు ఆడేలా ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇతర వివరాలకు 9848882551, 7989134190  ఫోన్​ నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ కోశాధికారి వీర్ల రవికుమార్, ఉపాధ్యక్షులు నరాల నరేశ్, మోహన్ నాయుడు, జాయింట్ సెక్రటరీ వీడీఐ రాజీవ్ రాజ్, క్రికెటర్లు ఎండీ ఇర్షాద్, రాజశేఖర్, వెంకట్, ఫణి, ఖయ్యూం, రాధిక పాల్గొన్నారు.